Case on KA Paul: ఎన్నికల పేరుతో భారీ మోసం.. కేఏ పాల్‌పై పోలీస్ కేసు నమోదు..!
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన దగ్గర భారీగా డబ్బులు తీసుకున్నట్లు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడో వ్యక్తి. గత నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆసెంబ్లీ ఎన్నికల్లో కే ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరఫున పలువురు అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించాడు కిరణ్ కుమార్ అనే వ్యక్తి. కిరణ్ కుమార్‌కు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సీటు కేటాయిస్తానని మాట ఇచ్చాడు కేఏ పాల్. ఎల్బీనగర్ టికెట్ కన్ఫామ్ చేసేందుకు 50 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు పోలీసులకు కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
ఈ ఉదాంతంపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. కేఏ పాల్ డిమాండ్ చేసిన 50 లక్షల రూపాయలలో 30 లక్షల రూపాయలు తాను ఆన్‌లైన్ ద్వారా చెల్లించినట్లు పోలీసులకు రుజువులు చూపించాడు. మరో 20 లక్షల రూపాయలను తాను పలు రకాలుగా కేఏ పాల్‌కు అందజేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. గతంలో ఇదే తరహాలో కేఏ పాల్ టికెట్ల పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేశాడంటూ ఆరోపణలు చేశారు.
ప్రజా శాంతి పార్టీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుండటంతో, కిరణ్ కుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేశాడు. గత ప్రభుత్వ హయాంలో గులాబీ పార్టీకి వ్యతిరేకంగా కేఏ పాల్ పలుమార్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. సెక్రటేరియట్ నిర్మాణంతోపాటు పలు అంశాలపై ఆయన హైకోర్టులో సైతం పిటిషన్లు దాఖలు చేశారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను పోటీ చేస్తానని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం కేఏ పాల్ పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. అప్పుడు భీమవరం నుండి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ నామినేషన్ గడువు ముగిసిన తర్వాత ఫైల్ చేయటంతో అతడి నామినేషన్ రిజెక్ట్ చేశారు ఎన్నికల సంఘం అధికారులు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సైతం కే ఏ పాల్ పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నరసాపురం నుండి లోక్‌సభకు పోటీ చేసిన కేఏ పాల్ కు3,037 ఓట్లు వచ్చా