షాపింగ్ మాల్ లో చీర కోసం పిచ్చ కొట్టుడు కొట్టుకున్న మహిళలు (విడియో చూడండి)

0

చీరలంటే ఇష్టపడని భారతీయ మహిళలు ఉండరనే చెప్పొచ్చు. ఎందుకంటే.. చీర కట్టులో వచ్చే అందం ఇంకే డ్రెస్‌లోనూ రాదు. కొందరు ఆడవాళ్లు నిత్యం కాకపోయినా.. పండగలకో.. పబ్బానికో.. ఏదైనా ఈవెంట్‌లోనో చీరలో మెరిసిపోవాలన్న ఆలోచనతో ఉంటారు. ఇందుకోసం ఖరీదైన చీరలు కొంటూ ఉంటారు. ఇంకా కొందరు రోజూ వారిగా కట్టుకోవటానికి సరసమైన ధరల్లో మంచి చీరలు కొంటూ ఉంటారు. ఏదైనా డిస్కౌంట్‌లో మంచి చీరలు వస్తున్నాయంటే మటుకు రెండు రకాల మహిళలు ఇక ఏమాత్రం ఆలోచించరు. అది డిస్కాంట్‌ సేల్‌ కాబట్టి ఎగబడిపోతారు. డిస్కౌంట్‌ సేల్స్‌లో గొడవలు జరగటం అన్నది సర్వసాధారణం. తాజాగా కూడా ఓ సంఘటన జరిగింది. చీర కోసం ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం కర్ణాటకలోని మల్లేశ్వరంలో మైసూరు సిల్క్‌ చీరల డిస్కౌంట్‌ సేల్‌ నడిచింది. తక్కువ ధరకు మంచి చీరలు వస్తుండటంతో మహిళలు పెద్ద ఎత్తున సేల్‌కు వచ్చారు. గంటల్లో వచ్చిన మాల్‌ మొత్తం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. నాకు కావాలంటే నాకు కావాలి అని తిట్టుకున్నారు. తర్వాత జుట్లు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. పోలీసు, ఓ మహిళా సిబ్బంది వారి గొడవను ఆపారు. ఈ గొడవ దృశ్యాలను ఓ మహిళ వీడియో తీసింది. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave A Reply

Your email address will not be published.