కూతురుకు సెల్యూట్ చేసి తండ్రి…

0

పిల్లలు తమ కన్న ఉన్నత స్థానానికి చేరుకున్నట్టయితే ఆ పేరెంట్స్ ఏ స్థాయిలో గర్వ పడతారో ఊహించుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి సంఘటనే శనివారం హైదరాబాద్ పోలీసు అకాడమీలో జరిగింది. ఎస్పీ ర్యాంకులో ఉన్న తండ్రి తన తనయకు సెల్యూట్ చేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో ఎన్ వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు ఉమ హారతి 2022 యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్స్ లో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ట్రైనింగులో ఉన్న ఉమ హారతి శనివారం తెలంగాణ పోలీసు అకాడమీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి హోదాలో వచ్చిన ఉమా హారతికి టీజీపీఏ డిప్యూటీ డైరక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు సెల్యూట్ చేసి స్వాగతం చెప్పారు. ఐఏఎస్ కావాలని కలలు కన్న ఆ తండ్రి తన కూతురుకు అఫిషియల్ గా సెల్యూట్ చేస్తు గర్వంగా ఫీలయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్న ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమ కలలు సాకారం చేసిన తనయ ఏకంగా తాను డ్యూటీ చేస్తున్న చోటకు రావడంతో తండ్రి వెంకటేశ్వర్లు ఆహ్వానించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com