హుజురాబాద్లో అగ్ని ప్రమాదానికి గురైన వ్యాపార సముదాయాన్ని సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలి... బాధితులకు నష్టపరిహారం అందించాలి.. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి...
- ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
- బాధితులకు నష్టపరిహారం అందించాలి
- బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
హుజురాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా కూడలిలో అగ్ని ప్రమాదానికి గురైన వ్యాపార సముదాయ కూడలి ప్రాంతాన్ని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్థానిక హుజురాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఇతర నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ప్రధానంగా
పండ్ల వ్యాపారుల దుకాణాలతో పాటు ఇతరత్రా షాపులు అగ్ని ప్రమాదానికి గురవడంతో మంగళవారం ఉదయం ఘటన స్థలాన్ని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించి వ్యాపారులకు సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
చిరు పండ్ల వ్యాపారుల షెడ్లు అగ్ని ప్రమాదానికి గురవడం విచారకరమన్నారు. చిరు వ్యాపారాల పండ్ల దుకాణాలకు సోమవారం రాత్రి నిప్పంటుకుని దుకాణాలు కాలిపోవడం తో ఇక్కడి వ్యాపార సముదాయ ప్రాంతం పూర్తిగా మంటల్లో చిక్కుకపోయిందని , ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వారందరికీ తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రమాద సంఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడటం జరిగిందని , ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి , నష్టపోయిన వ్యాపారులందరికీ తగిన న్యాయం చేయాలని కోరడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పైళ్ల వెంకట్ రెడ్డి, నల్ల సుమన్, బింగి కరుణాకర్, తూర్పాటి రాజు ,రావుల వేణు ,ప్రభాకర్ ,సబ్బని రమేష్, యాంషాని శశిధర్ , గంట సంపత్ ,బోరగాల సారయ్య, తిరుపతి, కోలిపాక వెంకటేష్ ,దేవేందర్,నరాల రాజశేఖర్ ,గుర్రం సంతోష్, హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.