కవితకు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..!

0

బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురి అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత మంగళవారం అనారోగ్యం పాలయ్యారు.

గమనించిన జైలు అధికారులు చికిత్స నిమిత్తం కవితను వెంటనే దీన్‌దయాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం కవిత విశ్వ ప్రయత్నాలు చేసిన ఆమెకు నిరాశే ఎదురువుతోంది. ఈ క్రమంలో కవిత అస్వస్థతకు గురి కావడం గమనార్హం. కవిత అస్వస్థతకు గురి అయ్యారని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Kalvakuntla Kavitha : మరోసారి తన‌ సేవాగుణాన్ని చాటుకున్న కల్వకుంట్ల కవిత,  అన్నీతానై భరోసా | Kalvakuntla kavitha which once again expresses her  humanity promises to be everything of china app ...

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com