అర్ధరాత్రి కారు బీభత్సం – ట్యాంక్ బండ్ వద్ద సీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్లి కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అయితే కారు ప్రమాదం చేసిన వారిని పోలీసులు మైనర్లుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు మైనర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కారును సీజ్ చేసిన పోలీసులు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.