బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది.. మంత్రి శ్రీధర్ బాబు..
పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిందని,కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు అయిన మేనిఫెస్టో లో పెట్టిన ప్రతీ పథకాన్ని అమలు చేసి తీరుతామని అన్నారు శ్రీధర్ బాబు.లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చిన విధంగా పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని అన్నారు.
గుడికి పరిమితం చేయాల్సిన దేవుణ్ణి తీసుకువచ్చి బీజేపీ ఓట్లు అడుగుతూ సమాజంలో విద్వేషాన్ని నింపుతుందని మండిపడ్డారు.మోడీ కార్పొరేట్ల కోసం పని చేస్తూ కోట్ల మంది మీద పన్నుల భారం మోపుతున్నారని అన్నారు.గడ్డం వంశీని గెలిపిస్తే యువత ఉపాధికి మాది గ్యారంటీ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.