ఓరిని ఫోటోషూట్ పాడుగాను..

కెమెరామెన్ చేసిన పనులు చూసి బిత్తరపోయిన పెళ్ళికూతురు.

0

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ సీజన్‌ నడుస్తోంది. పెళ్లికి ముందు వధూవరులు ప్రీ-వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌ చేసుకోవటం ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. ఇందుకోసం ముందుగా ఇరు కుటుంబాల అంగీకారంతో మంచి ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటారు. ఆ తర్మాత మంచి లోకెషన్‌లో అందమైన స్టైల్స్‌ అంతే అందంగా ఫోటోలు, వీడియోలు షూట్ చేస్తారు. అయితే, ఫోటో షూట్‌లో కెమెరామెన్ వధూవరులను రకరకాల భంగిమల్లో ఫోటోకు పోజులివ్వమని చెబుతుంటారు..కొన్ని కొన్ని సందర్బాల్లో అతనే స్వయంగా వాటిని చూపిస్తాడు. ఆ విధంగా ఇద్దరు కెమెరామెన్లు ఆ సన్నివేశాన్ని వధూవరులకు వివరిస్తూ సాగే ప్రేమ సన్నివేశమే సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వీరి పని చూసి వధూవరులు నిజంగానే షాక్ అయ్యారు. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వధూవరుల ఫోటో షూట్ సందర్భంగా ఈ వింత దృశ్యం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సోషల్ మీడియా అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో Instagram ఖాతా videonation.teb ద్వారా అప్‌లోడ్ చేయబడింది. వీడియోకు 18.2 k వీక్షణలు, చాలా లైక్‌లు వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.