చీ.. చీ.. మైనర్ స్టూడెంట్ తో కలిసి అశ్లీల ఫోటోలు దిగిన టీచర్.. దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు..

0

ఇటీవల టీచర్ మరియు విద్యార్థి చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వివాదాన్ని రేకెత్తించింది. కర్నాటకలోని చింతామణి తాలూకాలోని ఒక గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా గుర్తించబడిన టీచర్, మగ విద్యార్థితో కలిసి స్టడీ టూర్ సందర్భంగా వెళ్ళింది. ఈ సమయంలో తన స్టూడెంట్ తో కలిసి అభ్యంతరకర రీతిలో ఫోటో షూట్ తీసుకుంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో సోషల్ మీడియా మొత్తం ఆమెని దుమ్మెత్తి పోస్తోంది. లీక్ అయిన ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైస్కూల్ విద్యార్థితో ప్రధానోపాధ్యాయురాలు అభ్యంతరకర రీతిలో ఫోటోలు తీసుకోవడంతో.. ఆమెపై చర్యలు తీసుకోవాలి అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

చీ.. చీ.. మైనర్ స్టూడెంట్ తో కలిసి అశ్లీల ఫోటోలు దిగిన టీచర్.. దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు..

కుర్తా మరియు జీన్స్ ధరించిన విద్యార్థి తన టీచర్ ని ఎత్తుకోవడం, హాగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టడం లాంటివి చేయడం చాలా అభ్యంతరకరం. వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మరింత దారుణం. ఎస్‌ఎస్‌ఎల్‌సి చదువుతున్న మైనర్ బాలుడితో అనుచితంగా ప్రవర్తించిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. రొమాంటిక్ ఫోటోషూట్ గురించి తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రతిస్పందనగా, వారు వెంటనే పాఠశాలలో ప్రధానోపాధ్యాయునీపై ఆరోపణలు చేసారు. ఆమె ప్రవర్తన ఎలా ఉందొ చూసి.. చర్యలు తీసుకోవాలి అని కోరుతూ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)కి ఫిర్యాదు చేశారు, ఆమె ప్రవర్తనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. సోషల్ మీడియాలో పిచ్చి పలురకాలు అన్నట్లు.. రకరకాల ఫోటోలు వైరల్ అవుతుండడం సాధారణంగా జరుగుతూ ఉండే అంశమే. అయితే.. ఓ మైనర్ బాలుడితో ప్రధాన ఉపాధ్యాయ హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి చర్యకు పాల్పడడం మాత్రం అసాధారణం. ఈ ఘటనపై నెటిజన్స్ తమ వ్యతిరేకతను వ్ వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.