దారుంగా వ్యక్తి మృతి.. అతని చావుకు అసలు కారణం ఇదే
చింతపల్లి మండలం లోని మతిస్థిమితం సరిగ్గా లేక పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చింతపల్లి మండలం వెంకటేశ్వరనగర్ (మాల్ )గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పున్న అంజనేయులు వయసు 59 వెంకటేశ్వర నగర్ మాల్ లో టైలర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య పిల్లలు 4 సంవత్సరాల నుండి దూరంగ ఉండడంవల్ల అంజనేయులకు మనస్థాపానికి గురై గత 3 రోజులుగా అంజనేయులు కనపడక పోవడంతో మృతుని అన్న కొడుకుకు అనుమానం వచ్చి టైలర్ షాప్ వద్దకు వచ్చి చూడగా విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో షాపును తెరవడం జరిగింది. గుర్తు తెలియని క్రిమిసంహారకమందు సేవించి చనిపోయాడని నిర్ధారణకు వచ్చారు. మృతుని సొంత అన్న కొడుకు కోటయ్య ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చింతపల్లి ఎస్సై బాలకృష్ణ తెలిపారు.