ఒప్పో తొలి వాటర్ ప్రూఫ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!
ప్రస్తుతం మార్కెట్‌లో OPPO- F సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ విభాగంలో అగ్రగామిగా ఉన్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ OPPO మరో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో భాగంగా ‘Oppo F27 Pro+ 5G’ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా రిలీజ్ చేసింది. నీరు, ధూళి వంటి వాటి నుంచి రక్షణ ఇచ్చే ఐపీ 69 సర్టిఫికేషన్స్‌తో ఈ ఫోన్ వచ్చేసింది. దేశీయ తొలి వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇదే అని ఒప్పో కంపెనీ పేర్కొంటోంది. ఎఫ్ 27 ప్రో ప్లస్ ఫోన్ ఆర్మర్డ్ బాడీ, ప్రీమియం లెదర్ ఫినిషింగ్ ఈ స్మార్ట్‌ఫోన్ స్పెషాలిటీ.
దేశీయ తొలి వాటర్ ప్రూఫ్ ఫోన్
భారత్‌లో ప్రస్తుతం ఎడతెగని వర్షాల సీజన్ రాబోతోంది. స్మార్ట్‌ఫోన్ రిపేర్‌లలో 35 శాతం స్మార్ట్‌ఫోన్‌లు నీటిలో పడటం, వర్షం వల్ల ప్రమాదంలో ఉంటాయి. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుని.. ఒప్పో మరోసారి కొత్త డిజైన్‌తో భారతదేశపు “ఫస్ట్ సూపర్ రగ్డ్ మాన్‌సూన్ రెడీ ఫోన్” స్టైలిష్ OPPO F27 Pro+ 5G తో ఇప్పుడు వచ్చేసింది. OPPO F27 Pro+ 5G భారతదేశ వర్షాకాలపు నీటి సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా ఉండేలా గ్రౌండ్ నుండి రూపొందించబడింది.
ఈ OPPO F27 Pro+ 5G IP66, IP68 మరియు IP69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కలిగి ఉంటుంది. మరియు ఈ రేటింగ్ లతో వచ్చిన మొట్ట మొదటి ఫోన్ ఇదే. ఇది ధూళి ప్రవేశంతో పాటు అధిక పీడనం, అధిక-ఉష్ణోగ్రత నీటి స్ప్రేలను ఎదుర్కోగలదు మరియు 30 నిమిషాల వరకు మంచినీటిలో మునిగినప్పుడు కూడా యధావిధిగా పనిచేస్తుంది. OPPO F27 Pro+ 5G ఫోన్ IP69-రేటింగ్, 360 డిగ్రీ ఆర్మర్ బాడీ, అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది. ఈ ఫీచర్లతో భారతదేశంలో లాంచ్ చేయబడిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలిచింది.
Price :
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ (Oppo F27 Pro+ 5G) స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8జీబీ+128జీబీ వేరయంట్ ధర రూ.27,999గా కాగా.. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ప్రారంభం అయ్యాయి. జూన్ 20వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తాయి. ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ ఫోన్.. డస్క్ పింక్, మిడ్‌నైట్ నావీ రంగుల్లో లభించనుంది.
స్పెసిఫికేషన్స్:
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ (Oppo F27 Pro+ 5G) ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటుతో 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇంకా.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో ఇది వస్తోంది. డైమెనిసిటీ 7050 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది.
Camera and Battery:
ఈ ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్ వెనక వైపు 64 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాను పొందుపరిచారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 67W సూపర్ వూక్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ల పరిశీలిస్తే:
ఒప్పో ఎఫ్ 27 ప్రో+ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటుతో 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగిఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో రానుంది. డైమెనిసిటీ 7050 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్‌తో వస్తోంది. వెనకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్ ఇచ్చారు. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67W సూపర్ వూక్ ఛార్జింగ్ సదుపాయం కలిగి ఉంటుంది.