పవిత్ర పక్కన ఉంటే మరొకరి వైపు చూడాల్సిన పనిలేదు.. నరేష్ బోల్డ్ కామెంట్స్
సీనియర్ సినీ నటుడు నరేష్( Naresh ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోవడమే కాకుండా వివాదాలలో నిలుస్తూ వచ్చారు..
ఈయన తన వ్యక్తిగత జీవితంలో ఏకంగా మూడు పెళ్లిళ్లు( Three Marriages ) చేసుకున్నారు. అయితే తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్( Pavitra Lokesh ) తో రిలేషన్ లో ఉంటున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చినా కానీ అధికారకంగా వెల్లడించలేదు.
ఈ విధంగా నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న నరేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను తన తల్లి విజయనిర్మల( Vijaya Nirmala ) చనిపోయినప్పుడు ఎంతో మానసికంగా కృంగిపోయాను కానీ కృష్ణ( Krishna ) గారిని చూసి ధైర్యం తెచ్చుకున్నానని తెలిపారు.
అయితే కృష్ణ గారు కూడా మరణించిన తర్వాత తనకు ఏమీ దిక్కుతోచలేదు, ఒక్కసారిగా కృంగిపోయినట్టు అనిపించింది. అలాంటి సమయంలో పవిత్ర లోకేష్ తనకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు ఎంతో అండగా నిలిచారు. ఇలా అమ్మ కృష్ణ గారు ఇద్దరు చనిపోయినప్పుడు ఆమెలో నేను ఒక అమ్మోరును చూశాను ఒక స్నేహితురాలిని చూశాను, ఒక గైడ్ గా, అమ్మగా, ఒక కూతురుగా ఇలా అన్ని తనలో చూశానని తెలిపారు. పవిత్రలాంటి అమ్మాయి మన పక్కన ఉంటే మనం జీవితంలో మరొకరి వైపు చూడాల్సిన అవసరం ఏమాత్రం రాదు, అందరూ ఆమెలోనే కనిపిస్తారు అంటూ ఈ సందర్భంగా నరేష్ పవిత్ర గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.