జగిత్యాలలో దారుణం : బాలుడి కిడ్నాప్
ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్‌లు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం అబిడ్స్‌లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైన ఘటన మరువక ముందే జగిత్యాల పట్టణంలో మరో ఘటన చోటుచేసుకుంది. హజారీ కాలనీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు ఆరుబయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో చెత్త ఏరుకునే ఓ గుర్తు తెలియని వ్యక్తి పెద్ద గోనెసంచితో అటుగా వచ్చాడు. దీంతో ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడిని అపహరించేందుకు ప్రయత్నించగా.. బాలుడి తండ్రి గుర్తించి ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.