“నిర్మల్ జిల్లా బిజెపి ఎస్టి మోర్చా ఇన్చార్జిగా గుగులోతు శ్రీకాంత్ నాయక్ “
భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోతు శ్రీకాంత్ నాయక్‌ను నిర్మల్ జిల్లా ఇన్చార్జిగా నియమించారు. ఈ నియామక ప్రకటనను ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జె. కళ్యాణ్ నాయక్ శనివారం విడుదల చేశారు. కరీంనగర్‌కు చెందిన శ్రీకాంత్ నాయక్ ఇటీవలే రాష్ట్ర కార్యదర్శి పదవి పొందారు. ఇప్పుడు, నిర్మల్ జిల్లా ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా, శ్రీకాంత్ నాయక్, ఎస్టి మోర్చా రాష్ట్ర కమిటీకి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డిలకు, మరియు బిజెపి జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎస్ టి మోర్చా బలోపేతానికి, బిజెపి పటిష్టత కోసం శక్తివంతంగా కృషి చేస్తానని ఆయన చెప్పారు.