తీగల గుట్టపల్లిలో పారిశుద్ధ్య పనులపై ఫోకస్ పెట్టిన కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్..
కరీంనగర్ నగరపాలక సంస్థ 1వ డివిజన్ కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్ శనివారం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. ఆయన మున్సిపల్ కార్మికులతో కలిసి మురికి కాలువలను శుభ్రం చేయించారు. ప్రజలు క్రిమి కీటకాలు, దోమల వల్ల బాధపడకుండా ఉండటానికి బ్లీచింగ్, క్రిమిసంహారక రసాయనాలు, ఆయిల్ బాల్స్ వంటి చర్యలను చేపట్టారు.
ఈ సందర్భంగా, కార్పొరేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవల వర్షాల వల్ల డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో మురికి నీరు నిలిచిందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని ఉద్దేశించి పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.