ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ఏసీపీకి ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ నాయకులు

0
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారదాసు వసంతరావు ఆధ్వర్యంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ గారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వసంతరావు మాట్లాడుతూ నిన్న అసెంబ్లీ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అసభ్య పద జాలంతో మాట్లాడినందుకు , అదే విధంగా దానం నాగేందర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను మిమ్మల్ని బయట తిరుగనీయమని హెచ్చరించినందున … బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమైన మాకు వారి మాటల వల్ల భయాందోళన కలుగుచున్నవి. కావున బెదిరింపు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టా రీత్యా చర్యలు తీసుకోగలరని, కరీంనగర్ టౌన్ ఏసిపి కార్యాలయంలో కంప్లైంట్ చేయడం జరిగింది అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నారదాసు వసంతరావు తో పాటు, బిఆర్ఎస్వి నగర అధ్యక్షులు బొంకూరి మోహన్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన విభాగం ప్రతినిదులు వొడ్నాల రాజు , బిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అఫ్రోజ్ ఖాన్ , టిఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ మరియు బిఆర్ఎస్ యువజన నాయకులు డి.మదు పటేల్ ,అన్వేష్, సాయికుమార్, శశాంక్, కృష్ణ, పవన్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com