గోపాలరావుపేటలో సినీ దర్శకులు బోయపాటి పూజలు
సినీ దర్శకులు బోయపాటి శ్రీను కు జాతీయ యువజన అవార్డు గ్రహీత అల్వాల విష్ణు సత్కారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని భవాని రాజరాజేశ్వర దేవాలయానికి (శివాలయానికి) ఆదివారం విచ్చేసిన సినీ దర్శకులు బోయపాటి శ్రీను ప్రత్యేక పూజలు చేశారు. ఆయన గ్రామానికి రావడంతో ప్రజలు ఆయన్ని చూడడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కిరణ్ కుమార్, మహేశ్వర్, గ్రామ యువకులు కొలిపాక కమలాకర్, గుండి రాజేశ్వర్, కొలిపాక మల్లేశం, ప్రవీణ్, చందు, మనోజ్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.