చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆరాయిలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తామని, అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడతామని పేర్కొన్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
తెలంగాణను స్వయంగా అభివృద్ధి చేసుకుందామని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 11 రోజుల పర్యటనలో భాగంగా, సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి అమెరికాలోని పలు నగరాలు మరియు దక్షిణ కొరియాలోని సియోల్‌లో కూడా పర్యటించనున్నారు.