రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం.. త్వరలో ఎలక్ట్రికల్ స్కూటర్లు!
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రధాన గ్యారంటీలను వరుసగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో, 18 ఏళ్లు నిండిన యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ స్కీమ్‌కు సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే, ఈ పథకంలో విద్యార్హత ఉన్నవారికి మాత్రమే స్కూటర్లు ఇవ్వడం లేదా అందరికీ అవకాశం కల్పించడం వంటి వివిధ అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆడ పిల్లలు ఉంటే అందరికి స్కూటర్లు అందించాలా అనే ఆలోచన కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఇంకా, ఈ పథకం గురించి సర్కార్ నుండి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.