జాతీయ పతాకాన్ని ఎగరవేసిన కటకం లోకేష్..
కరీంనగర్ పట్టణం బుట్టి రాజారాం కాలనీ, సుభాష్ నగర్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బిజెపి కరీంనగర్ జిల్లా మీడియా కన్వీనర్ కటకం లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, జాతీయ పతాకాన్ని కటకం లోకేష్ ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. వాళ్లందరిని స్మరించుకునే రోజు ఇదేనన్నారు. 40 కోట్ల మంది కలిసి స్వాతంత్య్రాన్ని సాధిస్తే, 140 కోట్ల మంది ఏదైనా సాధించవచ్చన్నారు. హర్ ఘర్ తిరంగా అబియాన్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా కొనసాగాయని, ప్రజలంతా దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
ఈ కార్యక్రమం లో ఎలుగు కార్తీక్, సుధమళ్ళ నాగరాజు,గడ్డం సందీప్, నాసాని మహేష్,మంగ వంశీ,సున్నాయిల ప్రేమ్ కుమార్, వివేక్, జ్యోతి కుమార్, సోహైల్ మరియు తదితరులు పాల్గొన్నారు…