దమ్ముంటే కరీంనగర్ కు పెద్ద ప్రాజెక్టు తీసుకురా : బండి సంజయ్‌కు వెలిచాల సవాల్
కేంద్ర మంత్రివర్గం తాజాగా 8 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అయితే, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒక కొత్త రైల్వే లైన్ సాధించలేకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు బండి సంజయ్‌ను విమర్శించారు. కరీంనగర్‌కు సంబంధించి రైల్వే లైన్ ప్రతిపాదన చేసినారా, మంజూరీ కోసం ప్రయత్నాలు చేశారా అని ప్రశ్నించారు.
ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 24,657 కోట్ల అంచనా వ్యయంతో 8 కొత్త మార్గాలకు ఆమోదం లభించిందని, ఈ సందర్భంలో కరీంనగర్ కోసం ఎలాంటి ప్రాజెక్టు సాధించలేకపోయినందుకు బండి సంజయ్‌ను తీవ్రంగా విమర్శించారు. కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి, సిద్దిపేట నుంచి సిరిసిల్ల-వేములవాడ కొత్తపల్లి రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులకు మంజూరీ తీసుకొస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, సదరు ప్రాజెక్టులను సాధించడంలో బండి సంజయ్ వైఫల్యం చెందినట్టు ఆయన ఆరోపించారు.