Viral Video: ఓ మై గాడ్.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. వామ్మో, కట్టెపుల్లలు కావు బ్రో అవి..
సాధారణంగా పాము పేరు వింటేనే ఒళ్లు జలధరిస్తుంది.. ఇక దగ్గరగా చూస్తే భయంతో పరుగులు తీయాల్సిందే.. ఎందుకంటే పాములు చాలా విషపూరితమైనవి.. అవి కాటేస్తే ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే.. తీవ్రతను బట్టి కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.. అందుకే.. పాములకు దూరంగా ఉంటారు.. అలాంటిది ఓ యువకుడు పాములతో ఆటలాడుకున్నాడు.. ఒకటో రెండో కాదు ఏకంగా ఆరు పాములను పట్టుకుని వీడియో పొజులిచ్చాడు.. ఇది కావాలని చేశాడో.. లేక వైరల్ అవుదామని చేశాడో తెలియదు కానీ.. ఓ యువకుడు చేసిన పాముల స్టంట్ తెగ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి తన చేతులతో దాదాపు ఆరు పాములను కట్టెపుల్లలా మాదిరిగా పట్టుకున్నాడు.. ఆ తర్వాత వాటి తాళ్ల మాదిరిగా ఆడుస్తూ కనిపించాడు.. అయితే, సర్పాలను ఆడిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.. కొంతమంది పాములతో జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుండగా.. మరికొంతమంది నెటిజన్లు అలా పాములను హింసించడం మంచిది కాదంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ సంఘటన జరిగిన తేదీ.. ప్రదేశం గురించి నిర్ధారించలేదు కానీ.. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సర్ప్మిత్ర_రాయల్_యోగ్య’ (sarpmitra_royal_yogya) అనే హ్యాండిల్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కి “ర్యాట్ స్నేక్” అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్ట్ 7 రోజుల క్రితం షేర్ చేయగా.. 88 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి..
View this post on Instagram