దారుణం.. సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో ప్రసవం..

0

ముంబయిలో ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చిమ్మ చీకట్లో సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో డాక్టర్లు చేసిన సిజేరియన్ ఆ కుటుంబాన్ని విషాదంలో నెట్టేసింది. కాసులు గలగలలాడే బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖస్రుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి ఇటీవల నిండు గర్భిణీగా ఉన్న తన భార్యను సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోంలో చేర్పించారు. కరెంట్‌ పోయినా.. ఇతర ఏర్పాట్లు చేయకుండానే టార్చ్‌లైట్‌ వేసి, వైద్యులు ఆపరేషన్ చేశారని, దాంతో తల్లీబిడ్డ మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రికి తీసుకువచ్చేప్పుడు తన కోడలికి ఎలాటి ఆరోగ్య సమస్యలు లేవని ఏప్రిల్‌ 29న ఉదయం ఏడు గంటలకు డెలివరీ వార్డుకు తరలించారనీ… రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంచారనీ అన్సారీ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉందని, సహజ కాన్పు అవుతుందని వైద్యులు తొలుత చెప్పారనీ.. అప్పుడు ఆమెను చూడటానికి వెళ్తే.. రక్తపు మడుగులో కనిపించిందన్నారు.

Mumbai Shocker: 26-Yr-Old Woman, Newborn Die After C-Section Performed With Mobile  Light In Bhandup Maternity Home; BMC Initiates Action (VIDEO)

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com