రాజన్నను దర్శించుకున్న ఐజి రాజేష్ కుమార్ సక్సేన
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని ఐజి రాజేష్ కుమార్ సక్సేన గురువారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.