హైదరాబాద్ లో అనుమానితులపై కాల్పులు…

0

హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అనుమానిత వ్యక్తులను గుర్తించారు. వారిని విచారిస్తున్న క్రమంలో గొడ్డలితో దాడికి యత్నించారు అగంతకులు. దీంతో అలెర్ట్ అయిన పెట్రోలింగ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అనీస్, రాజు అనే ఇద్దరికి గాయాలు కాగా మరో ఇద్దరు దుండగులు పరార్ అయ్యారు. వీరంతా మాంగర్ బస్తీకి చెందిన దొంంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహా నగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్న సంఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో కాల్పుల ఘటనలు జరగడం ఇది ఐదో సారి కావడం గమనార్హం. ఈ ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడిన అనుమానితుల నుండి పూర్తి వివరాలు రాబట్టే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది.

Hyderabad News | One injured as police open fire on armed robbers near  Nampally Railway Station

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com