కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్
ఇంటినుంచి కళాశాలకు వెళుతున్న యువతిని అడ్డగించి ఆమెపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 6న యువతి కళాశాలకు వెళ్తుండగా ఇద్దరు యువకులు అడ్డగించి ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి నాపసర్ ప్రాంతంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని గంటలపాటు కదులుతున్న కారులో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కారు ఓ గ్రామంలోకి ప్రవేశించడంతో స్థానికులు అనుమానం వచ్చి ఆపారు. దీంతో యువతిని కారులో నుంచి బయటకు తోసేసి అక్కడ్నుంచి నిందితులు పారిపోయారు. గ్రామస్థులు బాధిత యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జనవరి 11న భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.