హైదరాబాద్ లో దారుణం : బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు
పార్కింగ్‌లో ఉన్న బస్సుకు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీ మసీదు వద్ద గోడ పక్కన నిత్యం కొన్ని వాహనాలు పార్కింగ్ చేసి ఉంటాయి. అందులో ఓ ప్రైవేట్ బస్సుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ లోపు బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది.