తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్
కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వారంతా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే బిజెపి నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.