అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్కామర్‌ల చేతిలో బలి అవ్వొద్దు: నిపుణుల హెచ్చరిక

0

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఈ నెలాఖరులో ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ ‘ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది.

ఇప్పటికే పలు ఉత్పత్తులపై డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లను ప్రకటించింది. అయితే, ఈ ప్రత్యేక సేల్ సందర్భంగా కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గతంలో కంటే ఈసారి స్కామర్‌లు ఎక్కువ మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని, అమెజాన్ రిటైలర్‌ల పేరుతో నకిలీ మెసేజ్‌లు, ఈ-మెయిల్‌ల నుంచి స్కామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేక సేల్ సమయంలో వినియోగదారులు ఎక్కువ ఖర్చు చేస్తారనే ఉద్దేశంతో వివిధ రకాలుగా మోసాలు జరిగే వీలుందని, కస్టమర్లు బలి అవ్వొద్దని సూచించారు.

ఈ నెల 20,21 తేదీల్లో ప్రైమ్ డే సేల్ మొదలవనుంది. దీంతో స్కామర్‌లు అమెజాన్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్ల ద్వారా మోసగించవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో లేదా మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా వచ్చే తప్పుడు లింక్‌లను క్లిక్ చేయవద్దని సైబర్ సెక్యూరిటీ కంపెనీ చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ తెలిపింది. ఇప్పటికే దాదాపు 1,230 కొత్త వెబ్‌సైట్లు అమెజాన్‌తో అనుబంధంగా పనిచేస్తున్నాయి. వాటిలో చాలావరకు మోసగించేవి ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్కామర్‌ల చేతిలో బలి అవ్వొద్దు: నిపుణుల హెచ్చరిక

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com