Watch Video: ‘ పీఎం మోదీ ఆరడుగుల బుల్లెట్’.. వేములవాడ సభలో బండి సంజయ్..

0

కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘గాడిద గుడ్డు’ అనేలా ఆ పార్టీ ప్రచారం చేస్తోందన్నారు బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ‘కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్ద గాడిద గుడ్డు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో నిర్వహించిన బహిరంగలో బండి సంజయ్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమ్యారని ధ్వజమెత్తారు. మహిళలకు ప్రతినెలా రూ. 2500 ఇస్తామన్న హామీని అటకెక్కించారన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఏమిచ్చారనే సందర్భాన్ని వివరిస్తూ.. చెప్పిన ఏ ఒక్క హామీలు అమలు చేయలేదని చెప్పేందుకు ప్రతిగా ‘గాడిద గుడ్డు’ అని వ్యంగాస్త్రాలు సంధించారు. ఆసరా పెన్షన్ పేరుతో రూ. 4000 ఇస్తామని ఇవ్వకుండా మాట తప్పారన్నారు. కౌలు రైతులకు రూ. 15వేలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారన్నారు. పంటకొంటామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీఎంబర్స్‎మెంట్ బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీల కోసం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు బండి సంజయ్. మోదీ గ్యారెంటీ గురించి చెబుతూ ఆరు అడుగుల బుల్లెట్ అని ప్రస్తావించారు.

BJP to form 34,000 booth committees with 6.8 lakh members: Bandi Sanjay

Leave A Reply

Your email address will not be published.