మరీ ఇంత దౌర్జన్యమా..? హాస్టల్ రూమ్‌కి ఫ్రెండ్‌ని తీసుకొచ్చాడని..?

0

మరీ ఇంత దారుణమా..? హాస్టల్‌లో ఉంటున్న యువకుడి వద్దకు అతని ఫ్రెండ్ వచ్చాడు. హాస్ట‌ల్ వరకు వచ్చినవాడిని లోపలికి వరకు పిలవకపోతే ఏం బాగుంటుందని.. రూమ్‌కి తీసుకెళ్లాడు. తిరిగి బయటకు వస్తున్న క్రమంలో.. హాస్టల్ నిర్వాహకుడు బయటివాళ్లను ఎందుకు లోపలికి తీసుకొచ్చావ్ అని అడిగాడు. తను ఫ్రెండ్ అని.. కాసేపు మాట్లాడానికి వచ్చాడు.. పంపించి వేస్తున్నా అని ఆ యువకుడు ఆన్సర్ ఇచ్చారు. అంతే.. హాస్టల్ నిర్వాహకుడు తిట్ల దండకం అందుకున్నాడు. ఇష్టం వచ్చినట్లు  బూతులు మాట్లాడాడు. హాస్టల్‌‌లో అతనెందుకు వాష్ రూమ్‌కి వెళ్లాడు అని ప్రశ్నిస్తూ..  నీళ్లు అయిపోవడానికి కారణం మీరే అంటూ నిందించాడు. హాస్టల్ నిర్వాహకుడి ప్రవర్తనపై యువకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు.

Hyderabad: మరీ ఇంత దౌర్జన్యమా..? హాస్టల్ రూమ్‌కి ఫ్రెండ్‌ని తీసుకొచ్చాడని..?

దీంతో హాస్టల్ నిర్వాహకుడు.. తనకు తెలిసినవారిని మరికొందర్ని పిలిపించి.. యువకుడిపై దాడికి తెగబడ్డాడు. రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నడం, లాగడం చేశాడు.  ఈ దాడిలో యువకుడి షర్ట్ చినిగిపోయి, శరీరంపై గాయాలయ్యాయి. అడ్డుకున్న అతడి ఫ్రెండ్‌కీ గాయాలయ్యాయి. హాస్టల్ నిర్వహించేవారి దౌర్జన్యాన్ని  ఎదురుగా ఉన్న మరో హాస్టల్‌లోని యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాధిత యువకులు ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. హాస్టల్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాఫ్తు చేస్తున్నారు.


Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com