జాగృతి ‘రూట్ మ్యాప్’ సిద్ధం.. ఎజెండా కమిటీతో కవిత జూమ్ కాన్ఫరెన్స్
తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎజెండా కమిటీ సభ్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు 32 అంశాలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలు, అన్ని పార్టీల రాజ్యాంగాల అధ్యయనం చేయాలని కమిటీలకు సూచించారు. క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ఈ నెల 17వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
