అనిల్ రావిపూడికి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ సమయానికే విడుదల కావాల్సి ఉంది. శంకర్ మధ్యలో భారతీయుడు2 సినిమాను పూర్తిచేయడంపై దృష్టిపెట్టడంతో గేమ్ ఛేంజర్ పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. బుచ్చిబాబుతో సినిమా చేసిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ తో కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ తీయబోతున్నాడు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. చివర సినిమాగా బాలయ్యతో భగవంత్ కేసరి తీశాడు. అది సూపర్ హిట్ అయింది. 2019 సంక్రాంతి పండగ సందర్భంగా రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, అనిల్ రావిపూడి చిత్రం ఎఫ్2 విడుదలయ్యాయి. రామ్ చరణ్ సినిమా ఫ్లాపవగా ఎఫ్ 2 సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ రెండు సినిమాలు విడుదలవడానికి కొద్దిరోజుల ముందు ఓ వేడుకలో రామ్ చరణ్, అనిల్ కలుసుకున్నారు. నా సినిమాకే పోటీగా నువ్వు సినిమాను విడుదల చేస్తున్నావా? అంటూ గట్టిగా నిలదీశాడంట. అంతే ఒక్కసారిగా అనిల్ రావిపూడి షాక్ అయ్యాడు. ఆ తర్వాత రామ్ చరణ్ అనిల్ రావిపూడిని గట్టిగా వాటేసుకొని నీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. దీంతో అనిల్ ఒక్కసారిగా హమ్మయ్య అనుకున్నాడు. భవిష్యత్తులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయాలని చెర్రీ అభిమానులు కోరుకుంటున్నారు. వారి ఆశ నెరవేరుతుందేమో చూద్దాం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ఇంతవరకు పరాజయం పాలవలేదు.