అకాల వర్షానికి తడిసిన ధాన్యం
పెద్దపల్లి నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో అకాల వర్షంతో రైతన్నలు నష్టపోయారు. ఓదెలలో ధాన్యం కొనుగోలు కేంద్రం వర్షపు నీటితో నిండిపోయింది. అలాగే ఈదురు గాలుల బీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.