తెలుగు రాష్ట్రాల్లో ఏడుగురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. తొలకరి వాన పలువురికి సంతోషాన్ని ఇవ్వగా.. కొంతమంది ఇళ్లల్లో విషాదాన్ని నింపింది. పలు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. పిడుగుపాటుకు పల్నాడు జిల్లా ఊటుకూరులో తల్లీకూతుళ్లు నాగేంద్రం, నాగరాణి చనిపోగా ఏలూరు జిల్లా యడవల్లిలో పరస రామారావు, తాడువాయిలో నాగేశ్వరరావు మరణించారు. మెదక్ లో కోళ్లఫారం గోడ కూలి ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యం, మాదాసు నాగు మృతి చెందారు. వర్ధన్నపేటలో ఈదురుగాలులకు చెట్టు కూలి దయాకర్ అనే వ్యక్తి మృతి చెందారు