భవిష్యత్ బీఆర్‌ఎస్‌దే
భవిష్యత్ అంతా బీఆర్‌ఎస్‌దేనని, రానున్న మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి లక్ష్మీనరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, కేసీఆర్ పదేళ్ల పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసేందేమీలేదని విమర్శించారు. అలవిగాని హామీలిచ్చి.. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నేరవేర్చలేదని మండిపడ్డారు. అందుకే గ్రామాల్లో ఆ పార్టీకి ఆదరణ కరువైందని, కాంగ్రెస్ పేరు చేపితేనే ప్రజలు తిడుతున్నారన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మ్కలపేటలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.