రాజన్న సేవలో ఎంపీ రఘునందన్ రావు

0

రాజన్న ఆలయ అభివృద్ధికై ఎంపీలందరం సమిష్టిగా కృషి చేస్తాం అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని శనివారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని స్వామి వారి సేవలో తరించారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనము అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రానికి రావాలసిన నిధులపై రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలందరం కలిసి సమిష్టిగా పోరాడుతామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ ప్రాంతం నుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్, కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి తో పాటు మిగతా ఎంపీలందరం తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం వేములవాడ రాజన్నను విస్మరించిందని, రాజన్న ఆలయ అభివృద్ధి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రసాద దర్శనం పథకం కింద ఆలయం ఎంపికయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com