జగిత్యాల జిల్లాలో తుపాకీ కలకలం
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో యువకుడు తుపాకీతో తిరగడం కలకలం రేపింది. ఇన్షర్ట్ వేసి బైక్ పైన తిరుగుతున్న యువకుడు బ్యాక్ సైడ్ గన్ కనిపించేలా పెట్టుకొని తిరగడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే తాను పోలీస్ డిపార్ట్మెంట్ లోని వెపన్స్ విభాగంలో పనిచేస్తున్నట్లుగా సదరు యువకుడు పోలీసులకు వివరించాడు. పోలీసులు వెంటనే ఆ యువకుడిని బీర్పూర్ పీఎస్ కు తరలించి విచారణ చేపట్టారు. యువకుడిని బీర్పూర్ మండలం కమ్మనూరు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు. అయితే అతడి వద్ద ఉన్నది డమ్మీ గన్ గా పోలీసులు నిర్ధారించారు. అయితే యువకుడి తల్లిదండ్రులను పిలిపించి మందలించి వదిలి వేసినట్లు సమాచారం.